ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు!

ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు!
X
అక్కినేని నాగచైతన్యకి చాలా కాలం తర్వాత 'తండేల్'తో మంచి సక్సెస్ లభించింది. 'తండేల్' విజయం తర్వాత ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' దర్శకుడితో నెక్స్ట్ మూవీని చేస్తున్నాడు.

అక్కినేని నాగచైతన్యకి చాలా కాలం తర్వాత 'తండేల్'తో మంచి సక్సెస్ లభించింది. 'తండేల్' విజయం తర్వాత ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' దర్శకుడితో నెక్స్ట్ మూవీని చేస్తున్నాడు. ఇది చైతూ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా చెబుతున్నారు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఈ సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే, నాగచైతన్య కెరీర్ లో 24వ చిత్రంగా 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు సినిమా రూపొందనుంది. ఈ సినిమా తర్వాత తన 25వ చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడట చైతన్య. తన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కోసం ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగచైతన్య 25వ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట. ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Tags

Next Story