ప్రభాస్ హ్యాండ్‌తో హైప్ రెట్టింపు

ప్రభాస్ హ్యాండ్‌తో హైప్ రెట్టింపు
X

చాలా కాలం తర్వాత స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “ఘాటి”. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన గ్లింప్స్ మాత్రం అంచనాలు మరింత పెంచేసింది.

1.21 నిమిషాల గ్లింప్స్‌లో అనుష్క ఊచకోత, మాస్ డైలాగ్స్, క్రిష్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బస్సు వెనుక కొడవలి పట్టుకుని నడిచే సీన్‌, తలను పట్టుకుని వచ్చే సీన్‌, చివర్లో “వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే.. నేను ఊరుకోను” అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి స్కోర్ విజువల్స్‌ను ఎలివేట్ చేస్తోంది.

ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి వ్యాపారంపై ఈ సినిమా సాగుతుంది. ఒక గిరిజన యువతి శీలావతి పరిస్థితుల కారణంగా మాఫియాలో చిక్కుకుని శక్తిమంతురాలిగా మారే కథాంశం ఇందులో చూపించబోతున్నారని తెలుస్తోంది.

అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. విక్రమ్ ప్రభు ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Tags

Next Story