ప్రభాస్ 'ఫౌజీ' లుక్ లీక్!

ప్రభాస్ ఫౌజీ లుక్ లీక్!
X
రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో 'ఫౌజీ' ఒకటి. ఇప్పటివరకూ ఈ చిత్రం టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా 'ఫౌజీ' టైటిల్ కే ఫిక్సయ్యారు ఫ్యాన్స్.

రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో 'ఫౌజీ' ఒకటి. ఇప్పటివరకూ ఈ చిత్రం టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా 'ఫౌజీ' టైటిల్ కే ఫిక్సయ్యారు ఫ్యాన్స్. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రభాస్ ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో కనిపించనుండగా, ఇటీవల ఆయన లుక్ లీక్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ హైప్ ఏర్పడింది. ఆ లుక్‌ 'మిర్చి' సినిమా తరహాలో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో నిజంగానే సెట్స్ నుంచేనా? లేక ఫ్యాన్స్ క్రియేట్ చేశారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

ఈ సినిమా బ్రిటీష్ ఇండియా (1940ల కాలం) నేపథ్యంతో సాగుతూ, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ప్రేమ కథగా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేసి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.700 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Tags

Next Story