'భైరవం' నుంచి పవర్‌ఫుల్ జాతర సాంగ్!

X
'పుష్ప 2' సినిమాలోని జాతర ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగో రేణుక తల్లి అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించింది. ఇప్పుడు 'భైరవం' కోసం బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జాతర సాంగ్ లో రెచ్చిపోయాడట. రాబోయే మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి 'భైరవం థీమ్' సాంగ్ రాబోతుంది. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.
జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో బెల్లంకొండ తనదైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతంలో చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను శంకర్ మహాదేవన్ ఆలపించారు. రేపు ఫుల్ లిరికల్ సాంగ్ రానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్, మంచు మనోజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story
-
Home
-
Menu