వింటేజ్ లుక్ లో పవర్ స్టార్

వింటేజ్ లుక్ లో పవర్ స్టార్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా సోషల్ మీడియాలో అభిమానులు జోరుగా వేడుకలు జరుపుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా సోషల్ మీడియాలో అభిమానులు జోరుగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఓజీ‘ నుంచి వరుస అప్‌డేట్స్ అందుతున్నాయి.

దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేసి అభిమానులకు బర్త్ డే కానుకగా అందించారు. ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌తో, వింటేజ్ డాడ్జ్ కార్‌పై కూర్చుని సూపర్ కూల్‌గా కనిపిస్తున్నాడు. అయితే కార్ కింద రక్తపాతం కనిపించడం పోస్టర్‌కి మరింత మాస్ ఫీలింగ్‌ని తెచ్చింది. ఈ వింటేజ్ టచ్‌తో కూడిన కూల్ లుక్ అభిమానుల్లో ఊహించని కిక్‌ని ఇచ్చింది.

‘ఓజీ‘ నుంచి ఈరోజు సాయంత్రం స్పెషల్ గ్లింప్స్ రాబోతుండగా.. ఈ మూవీ ట్రైలర్ ను ఈనెల 19న విడుదల చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ‘ఓజీ‘ ప్రీ సేల్స్ మొదలయ్యాయి. ఈ సినిమా టికెట్స్ కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది.

పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story