బెట్టింగ్ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం!

బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆమాయక ప్రజలు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీ.సీ. సజ్జనార్ ఫిర్యాదుతో ఈ చర్యలు వేగవంతమయ్యాయి.
పంజాగుట్ట పోలీసులు 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులు నమోదు చేశారు. ఇందులో యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులు ఉన్నారు.
హీరోయిన్ కాజల్ గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో బయటకు రావడంతో, సోషల్ మీడియాలో ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. IPL సీజన్ నేపథ్యంలో, సెలబ్రిటీలను ఉపయోగించి యాప్ యజమానులు పెద్ద మొత్తంలో ప్రచారం చేయించుకుంటుండటంతో, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
-
Home
-
Menu