ఏఎన్‌ఆర్ కు ప్రధాని మోదీ నివాళి!

అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) 100వ జయంతిని పురస్కరించుకుని, ఆయన సినీ రంగానికి అందించిన విశేష సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్మరించుకున్నారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రధాని మోదీకి 'మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం' అనే పుస్తకాన్ని అందజేశారు. ఏఎన్‌ఆర్ సినీ ప్రస్థానం గురించి ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన పుస్తకమిది.
ఏఎన్‌ఆర్ ఏడుదశాబ్దాల సినీ ప్రస్థానాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ, తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమను మార్చడంలో ఆయన నిర్ణయం, నేటి గ్లోబల్ సినిమా హబ్‌గా హైదరాబాద్‌ను నిలిపిందని అన్నారు.
నటుడిగానే కాకుండా, విద్య, సాహిత్యం, ప్రజా సేవలోనూ విశేష కృషి చేసిన ఏఎన్‌ఆర్, అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు అనేక విద్యా సంస్థలను స్థాపించారని ప్రధాని కొనియాడారు. 'మనకి బాత్' 117వ ఎపిసోడ్‌లో ఏఎన్‌ఆర్‌కు నివాళి అర్పించిన ప్రధాని, భారతీయ సినిమా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
-
Home
-
Menu