సినీ పరిశ్రమకు పెనుముప్పుగా మారిన పైరసీ

సినీ పరిశ్రమకు పెనుముప్పుగా మారిన పైరసీ
X

సినీ పరిశ్రమకు పెనుముప్పుగా మారిన పైరసీసినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే నిర్మాతలకు ఆనందం. కానీ, గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడటం పరిశ్రమకు పెను సమస్యగా మారింది. ముఖ్యంగా హెచ్.డి. క్వాలిటీలోనే చిత్రాలు లీక్ అవ్వడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల 'గేమ్ ఛేంజర్, తండేల్' వరుసగా రెండు పెద్ద సినిమాలు పైరసీ బారిన పడ్డాయి.

ఫిబ్రవరి 7న విడుదలైన నాగచైతన్య 'తండేల్' సినిమా మొదటి రోజే పైరసీ బారిన పడింది. కొంతమంది ఆకతాయిలు ఈ మూవీ హెచ్.డి. ప్రింట్‌ను లీక్ చేయడంతో పాటు, ట్రావెల్ బస్సుల్లోనూ ప్రదర్శించారని సమాచారం. దీనిపై నిర్మాత బన్నీ వాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు వివరాలను గుర్తించి, ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. పైరసీ చేసినవారితో పాటు, డౌన్లోడ్ చేసుకుని వీక్షించినవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వెబ్‌సైట్‌లు, టెలిగ్రామ్, వాట్సాప్ వంటివి పైరసీకి ప్రధాన వేదికలుగా మారాయి. ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాలంటే, కేవలం ఫిర్యాదులు, హెచ్చరికలతో కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. కాబట్టి ఒకరిద్దరి పోరాటంతో ఇది సాధ్యం కాదు. మొత్తం సినీ పరిశ్రమ కలిసి పైరసీని అరికట్టేందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలి. లేదంటే ఈ పైరసీ భూతం మరింత విస్తరించి, పరిశ్రమకు భారీగా నష్టం కలిగించనుంది.

Tags

Next Story