పవన్ డిజైన్ చేసిన ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.. జ్యోతికృష్ణ

పవన్ డిజైన్ చేసిన ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.. జ్యోతికృష్ణ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదు, డైరెక్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఫైట్ కొరియోగ్రాఫర్ కూడా. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదు, డైరెక్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఫైట్ కొరియోగ్రాఫర్ కూడా. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి నటించిన 'డాడీ' సినిమాలోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ ఫైట్ ను డిజైన్ చేయడం విశేషం.

ఇక 'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ మరోసారి ఫైట్ మాస్టర్ గా మారాడు. ఏకంగా 50 నుంచి 60 రోజుల వరకూ ఆ ఫైట్ చిత్రీకరణ సాగిందట. సినిమాలో 18 నిమిషాల పాటు ఉండే ఆ ఫైట్ కు రీ రికార్డింగ్ చేయడానికి సంగీత దర్శకుడు కీరవాణి 10 రోజుల సమయాన్ని తీసుకున్నారని డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నారు. ఈ ప్రెస్ మీట్ కి కీరవాణి గారు కూడా హాజరవ్వాలి. అయితే ఆయనకు హాస్పిటల్ అపాయింట్ మెంట్ వలన హాజరుకాలేకపోయారని జ్యోతికృష్ణ అన్నారు.

Tags

Next Story