పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్

పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్
X
మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పార్లమెంటులో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ ఘనతపై మెగాస్టార్ అభిమానులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పార్లమెంటులో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ ఘనతపై మెగాస్టార్ అభిమానులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిరంజీవిపై హృదయపూర్వక ట్వీట్ చేశారు. 'చిరంజీవి గారు నాకు అన్నయ్య మాత్రమే కాదు, తండ్రి సమానమైన మార్గదర్శి. ఆయన సాధించిన ప్రతిష్ఠ మా కుటుంబానికి గర్వకారణం. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ఆయన, నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులను తన నటనతో అలరించారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు సాధించి, నటనకు పర్యాయపదంగా నిలిచారు' అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేశారని, రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని పవన్ పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారానికి గౌరవార్థం, ఇప్పుడు యూకే పార్లమెంటు అందించిన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు చిరంజీవి ప్రతిభకు నిదర్శనమని చెప్పారు.

ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించిన స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, చిరంజీవి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


https://x.com/PawanKalyan/status/1902575183405457832

Tags

Next Story