వీరమల్లు కోసం త్రిబాణధారిగా పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి నటిస్తున్న చారిత్రక కథాంశ చిత్రం ‘హరి హర వీరమల్లు‘. పేరుకు చారిత్రక అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమాని ఓ ఫిక్షనల్ స్టోరీగా మూవీ టీమ్ చెబుతోంది. మొఘలుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో వీరమల్లుగా ఓ యుద్ధ వీరుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసే మల్ల యుద్ధాలు ఎంతో హైలైట్ గా ఉంటాయని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. అలాగే విల్లంభు ధరించి త్రిబాణధారిగానూ పవన్ కళ్యాణ్ చేసే యుద్ధ నైపుణ్యాలు ‘వీరమల్లు‘కి మరో అట్రాక్షన్. ఇటీవల ఈ సినిమా నుంచి ‘మాట వినాలి‘ అంటూ పవన్ కళ్యాణ్ పాడిన పాట విడుదలైంది. తాజాగా అందుకు సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ బిహైండ్ ది సీన్స్ లో పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు బాణాలు సంధిస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మాట వినాలి‘ పాటను ఎంతో మమేకమై పవన్ పాడిన తీరు కూడా ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ఈ పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ ఏడాది మార్చి 28న ‘హరి హర వీరమల్లు‘ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతుంది.
-
Home
-
Menu