‘పరదా’కి సెన్సార్ క్లియర్

టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సీబీఎఫ్‌సీ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆనంద మీడియా అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాను రాజ్ & డీకే సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సోషల్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
విడుదలకు ముందే ఈ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ఆగస్టు 20న హైదరాబాద్‌లోని ఏఎంబి, ఏఏఏ సినిమాస్‌లో ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
-
Home
-
Menu