నటి, నాట్యకారిణి శోభనకు పద్మభూషణ్!

నటి, నాట్యకారిణి శోభనకు పద్మభూషణ్!
X
నటన, నృత్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది శోభన. 90వ దశకంలో ఆమె నటన, ప్రత్యేకంగా ఆమె కళ్లలోనుండి వ్యక్తమయ్యే భావప్రకటన, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నటసింహం బాలకృష్ణను పద్మభూషణ్ వరించింది. తమిళనాడు నుంచి అజిత్ కుమార్ కు పద్మభూషణ్ వరిస్తే.. కేరళ నుంచి నటీమణి శోభనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది.


నటన, నృత్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది శోభన. 90వ దశకంలో ఆమె నటన, ప్రత్యేకంగా ఆమె కళ్లలోనుండి వ్యక్తమయ్యే భావప్రకటన, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. 1980లోనే బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టిన శోభన, 1984లో మలయాళ చిత్రం ‘ఏప్రిల్‌ 18’ ద్వారా కథానాయికగా తన సినీ ప్రయాణం ప్రారంభించింది.


తెలుగులో నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్'లో నాయిక అయిన శోభనకు.. 'మువ్వ గోపాలుడు, రుద్రవీణ, అభినందన, నారీనారీ నడుమ మురారి, కోకిల, అల్లుడు గారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ అల్లుడు’వంటి చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ 'కల్కి' చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది.


మలయాళం చిత్రం ‘మణిచిత్రతాళు’లోని నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది శోభన. ఆ తర్వాత ‘మిత్ర్‌ మై ఫ్రెండ్‌’ చిత్రంతో రెండోసారి జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. కళారంగానికి చేసిన సేవలకు గాను 2006లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించి గౌరవించింది.

Tags

Next Story