'వార్ 2'లో రెండు పాటలేనా?

పాన్ ఇండియా స్థాయిలో అగ్రహీరోల కలయికలతో భారీ అంచనాలు నెలకొల్పుతున్న చిత్రం ‘వార్ 2’. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌ల మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈరోజు (మే 20) తారక్ బర్త్ డే స్పెషల్ గా ‘వార్ 2’ నుంచి ఓ స్పెషల్ వీడియో రాబోతున్నట్లు హృతిక్ స్వయంగా తెలిపి, 'ఈ వీడియో తారక్‌కి కూడా సర్‌ప్రైజ్ అవుతుంది' అని పేర్కొనడంతో, ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ భారీ మల్టీస్టారర్ లో కేవలం రెండు పాటలే ఉంటాయట.
ఒకవైపు ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరొందిన ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌లు ఒకే సినిమాలో ఉన్నా, 'వార్ 2' కోసం కేవలం రెండు పాటలనే డిజైన్ చేశాడట డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఒక పాటను హృతిక్ రోషన్ – కియారా అద్వానీ పై ఇప్పటికే చిత్రీకరించారని, అందులో కియారా బికినీ లుక్‌తో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
రెండవ పాటను హృతిక్ – ఎన్టీఆర్‌లపై తెరకెక్కించనుండగా, ఈ సాంగ్ షూట్‌ను వచ్చే నెలలో చిత్రీకరించనున్నారట. వారం రోజుల పాటు చిత్రీకరించే ఈ పాటలో ఎన్టీఆర్-హృతిక్ వేసే స్టెప్స్ ఓ రేంజులో ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా ఈరోజు 'వార్ 2' నుంచి వచ్చే అప్డేట్ ఏ రేంజులో అలరిస్తుందో చూడాలి.
-
Home
-
Menu