ఒకే హీరో... ఇద్దరు హీరోయిన్స్

ఒకే హీరో... ఇద్దరు హీరోయిన్స్
X

తెలుగు సినిమాల్లో ఒకే హీరోకి ఇద్దరు హీరోయిన్లు ఉండటం సాధారణమే. ముఖ్యంగా 2000ల నుండి 2010ల మధ్యలో ఈ తరహా కథలు చాలా కనిపించేవి. అయితే ఇటీవలికాలంలో ఈ విధమైన చిత్రాలు, ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో, తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ కొన్ని పెద్ద స్టార్ సినిమాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది.

విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం గా, వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సొసియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమాలో సుమారు నలుగురు నాయికలు ఉండనున్నారని సమాచారం. అయితే ప్రధాన కథానాయికలుగా త్రిషా, ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి సోదరీమణులుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి కనిపించనుంది.



ది రాజా సాబ్

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. రిధి కుమార్ కీలక సహాయ పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు నిధి, మాళవికలతో రొమాంటిక్ ట్రాక్‌లు ఉంటాయని సమాచారం.




అల్లు అర్జున్-అట్లీ సినిమా

అతిపెద్ద బడ్జెట్‌తో రూపొందనున్న అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే వంటి పేర్లు వినిపిస్తున్నా, ఎవరిని ఫైనల్ చేస్తారో అధికారికంగా తెలియాల్సి ఉంది.



పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి సినిమా

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 'బెగ్గర్' అనే టైటిల్‌తో రాబోతుందని వినిపిస్తోంది. ఈ చిత్రంలో టబు ఇప్పటికే ఓ కీలక పాత్రలో ఖరారయింది. తాజాగా రాధికా ఆప్టే, నివేదా థామస్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మిగిలి ఉంది.




ఇతర హీరోల చిత్రాలు

స్టార్ సినిమాలే కాకుండా, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో కూడా ఇద్దరు కథానాయికలు కనిపిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న ‘నారి నారి నటుమ మురారి’ (సమ్యుక్త, సాక్షి వైద్య), ‘భోగి’ (అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి), శ్రీ విష్ణు సినిమా ‘సింగిల్’ (ఇవానా, కేతిక శర్మ), నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న ‘స్వయంభూ’ (సంయుక్త, నభా నటేష్) సినిమాల్లో ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు.





సో... మొత్తానికి ఇటీవల సంవత్సరాల్లో తగ్గిన ఈ ట్రెండ్ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. కథలో వైవిధ్యం, ప్రేక్షకులకు కొత్తదనం ఇచ్చే ప్రయత్నంలో ఇద్దరు కథానాయికల ఫార్ములా మళ్లీ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

Tags

Next Story