'జాట్' నుంచి 'ఓ రామ శ్రీ రామ'!

X
సన్నీ డియోల్ హీరోగా మలినేని గోపీచంద్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జాట్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన హిందీ చిత్రమిది.
సన్నీ డియోల్ హీరోగా మలినేని గోపీచంద్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జాట్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన హిందీ చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి సన్నీ డియోల్, రణదీప్ హుడా, సయామీ ఖేర్ వంటి వారితో పాటు జగపతిబాబు, రెజీనా, రమ్యకృష్ణ వంటి సౌత్ యాక్టర్స్ నటించారు.
ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చిన 'జాట్' నుంచి ఇప్పటికే వచ్చిన 'టచ్ కియా' సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈరోజు ఈ చిత్రం నుంచి శ్రీరామ నవమి కానుకగా 'ఓ రామ శ్రీ రామ' అనే గీతం విడుదలైంది. ఆద్యంతం శ్రీరామ నామ స్మరణలతో సన్నీ డియోల్ ఎలివేషన్స్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 10న 'జాట్' విడుదలకు ముస్తాబవుతుంది.
Next Story
-
Home
-
Menu