‘ఓజీ’ సెకండ్ సింగిల్ అప్డేట్

‘ఓజీ’ సెకండ్ సింగిల్ అప్డేట్
X
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ మూవీలో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. 'హరిహర వీరమల్లు' నిరాశపరచడంతో పవన్ ఫ్యాన్స్ 'ఓజీ'పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ లిరికల్ సాంగ్ రాగా.. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ వస్తోంది. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న 'సువ్వి సువ్వి' అంటూ సాగే గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ఓ పండగ వాతావరణాన్ని తలపించే గీతంగా ఈ పాట ఉండబోతున్నట్టు ఈ సాంగ్ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ పాటలో హీరోహీరోయిన్లు పవన్, ప్రియాంక సందడి చేయబోతున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తుంది.



Tags

Next Story