‘ఓదెల 2‘ టీజర్.. శివశక్తిగా అదరగొడుతోన్న తమన్నా!

‘ఓదెల 2‘ టీజర్.. శివశక్తిగా అదరగొడుతోన్న తమన్నా!
X

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాను వేదికగా మార్చుకుంటున్నాయి మన తెలుగు చిత్రాలు. ఇప్పటికే కుంభమేళాలో నటసింహం బాలకృష్ణ ‘అఖండ 2‘ కోసం కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు తమన్నా ‘ఓదెల 2‘ టీజర్ ను కుంభమేళా వేదికగా విడుదల చేశారు.



తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 'ఓదెల రైల్వే స్టేషన్' కు సీక్వెల్. దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించబోతుంది. సంపత్ నంది టీమ్ వర్క్స్ తో కలిసి మధు క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది.

ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం అలరించేలా ఉంది. ‘ఓదెల రైల్వే స్టేషన్‘ మూవీలో నటించిన హెబ్బా పటేల్ కూడా సీక్వెల్ లోనూ సందడి చేయబోతుంది. ‘కాంతార, విరూపాక్ష‘ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. త్వరలోనే ‘ఓదెల 2‘ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story