ఎన్.టి.ఆర్ కు భారతరత్న వస్తుంది .. బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల నేపథ్యంలో, తనకు పద్మభూషణ్ కంటే తన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్)కు భారతరత్న రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
విశ్వ విఖ్యాత నట సామర్వభౌమ ఎన్.టి.ఆర్ భారతీయ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహానీయుడు. నటన, రాజకీయ రంగాలలో అత్యున్నత శిఖరాలు అందుకున్న నటరత్న ఎన్.టి. రామారావుకి భారతరత్న అవార్డు రావాలని కోట్లాది తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అదే విషయాన్ని తాజాగా బాలకృష్ణ తెలియజేశారు.
'నాన్నగారికి భారతరత్న రావాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నాం. ఇది కచ్చితంగా జరుగుతుంది. తెలుగు జాతి ఈ గౌరవాన్ని సాధించేందుకు కృషి చేస్తుంది' అని బాలకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల ప్రతిస్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
Home
-
Menu