బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్ Vs విజయ్!

తెలుగు వారికి సంక్రాంతి ఎలాగో.. తమిళులకు పొంగల్ అంత స్పెషల్. అందుకే ఒక సంవత్సరం ముందుగానే రాబోయే పండగకు తమ సినిమాలను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంటారు. అలా వచ్చే సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్-నీల్ మూవీ జనవరి 9, 2026న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకోసం 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ వారంలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. అక్కడ నుంచి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుని.. వచ్చే సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.
వచ్చే సంక్రాంతి కానుకగా తెలుగు నుంచి మరికొన్ని సినిమాలైతే వస్తాయి. అయితే అవి ఏంటనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ అటు పొంగల్ రేసులో మాత్రం తమిళ ఇలయదళపతి విజయ్ 'జన నాయగన్' రిలీజ్ కు రెడీ అవుతుంది. విజయ్ నటించే చివరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ మూవీ ఇటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఇక పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఎన్టీఆర్-నీల్ మూవీకి విజయ్ 'జన నాయగన్' తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో చాలా గట్టి పోటీ ఇవ్వనుంది. విజయ్ కి తమిళనాడుతో పాటు కేరళలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 'జన నాయగన్' క్రేజ్ కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్-నీల్ మూవీకి థియేటర్లు కూడా పెద్ద సమస్య అయ్యే అవకాశాలున్నాయి.
-
Home
-
Menu