ఎన్టీఆర్ vs హృతిక్: డ్యాన్స్ ఫ్లోర్‌పై పోటీకి రెడీ!

ఎన్టీఆర్ vs హృతిక్: డ్యాన్స్ ఫ్లోర్‌పై పోటీకి రెడీ!
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ ఇస్తోన్న మూవీ 'వార్ 2'. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు తారక్. నార్త్, సౌత్ లలోని ఇద్దరు బడా స్టార్స్ తో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'వార్ 2'పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'వార్ 2' చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్-హృతిక్ మధ్య వచ్చే ఓ డ్యాన్స్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. ప్రస్తుతం దేశంలోని టాప్ డ్యాన్సర్స్ లిస్టులో హృతిక్, ఎన్టీఆర్ మొదటి స్థానాల్లో నిలుస్తారు. అలాంటి ఈ ఇద్దరితో డ్యాన్స్ నంబర్ అంటే ఓ రేంజులో ఉంటుంది.

ఇప్పటికే హృతిక్ తో డ్యాన్స్ చేయడం గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు తారక్ తెలిపాడు. తాజాగా హృతిక్ కూడా ఎన్టీఆర్ తో స్టెప్పులేసేందుకు ఎంతో కసరత్తులు చేయబోతున్నట్టు తెలియజేశాడు. 'నాటు నాటు' పాటలో ఎన్టీఆర్ చేసిన స్పీడ్ స్టెప్స్ ను మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని.. అందుకోసం తాను ఎంతో కృషి చేస్తున్నట్టు తాజాగా మీడియాకి తెలిపాడు హృతిక్.

Next Story