ఎన్టీఆర్-నీల్ ఓవర్సీస్ డీల్!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. 'కె.జి.యఫ్, సలార్' వంటి సినిమాలతో తనకంటూ సెపరేటు ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పాన్ వరల్డ్ రేంజులో అంచనాలున్నాయి. ఇక ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకుంది.
ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడట తారక్. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఎన్టీఆర్-నీల్ మూవీ అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందట. ఎన్టీఆర్-నీల్ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకున్నట్టు ప్రత్యంగిరా తెలిపింది. అయితే ఈ డీల్ ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ మాస్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఎన్టీఆర్-నీల్ మూవీ ఇండియన్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
-
Home
-
Menu