యాక్షన్ మాత్రమే కాదు, ప్రేమ కూడా!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హిట్-3’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా 'హిట్' ఫ్రాంచైజీలో ఈ సినిమా రాబోతుంది. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ రిలీజయ్యింది. ఈ సినిమాలో నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర ఎంతో ఇంటెన్స్‌గా, యాక్షన్-ప్యాక్డ్‌గా ఉంటుందని టీజర్ ను బట్టి అర్థమయ్యింది.
ఈ కథలో రక్తపాతం, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు.. ప్రేమకు కూడా ప్రత్యేక స్థానం ఉందని తాజా ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ ఇందులో ప్రేమ కోణాన్ని హైలైట్ చేయనుంది. మార్చి 24న విడుదల కాబోతున్న ఈ మెలోడీ నాని పాత్రలోని భావోద్వేగాలను బయట పెట్టేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌లో ఆసక్తిని రేపుతోంది. మే 1న 'హిట్ 3' పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu