రామ్ గోపాల్ వర్మపై నాన్-బెయిలబుల్ వారెంట్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ముంబై అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని కోర్టు దోషిగా తేల్చింది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మపై కేసు పెట్టాడు. ఆ కేసులో విచారణ ఏడు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే విచారణ సమయంలో వర్మ కోర్టు సమన్లను ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయడంతో కోర్టు ఆగ్రహించింది. దీంతో వర్మపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది.
మెజిస్ట్రేట్ కోర్టు తన తీర్పులో ఫిర్యాదుదారుడికి వచ్చే మూడు నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం చెల్లించసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ముంబై అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని కోర్టు దోషిగా తేల్చింది.వలసిన అవసరం ఉందని పేర్కొంది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే, వర్మకు 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించబడుతుందని స్పష్టం చేసింది.
తన మాటలు, చర్యలతో తరచూ వివాదాలకు కేంద్రంగా మారే రామ్ గోపాల్ వర్మ గతంలోనూ ఎన్నో సెన్సేషనల్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
-
Home
-
Menu