డబ్బింగ్ పూర్తి చేసిన నితిన్

డబ్బింగ్ పూర్తి చేసిన నితిన్
X
నితిన్ అప్‌కమింగ్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది.

నితిన్ అప్‌కమింగ్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. నితిన్ ఇందులో ఓ ప్రొఫెషనల్ ఆర్చర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా నితిన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం డబ్బింగ్ స్టూడియోలోని వీడియోను విడుదల చేసింది.

ప్రముఖ నటి లయ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తుండటం మరో హైలైట్. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, వర్ష బొల్లమ్మ, స్వాసిక, సౌరభ్ సచ్‌దేవా, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'అంబరగొడుగు' అనే ప్రదేశంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఓ దారిలోనే వెళ్లగలిగే, ప్రమాదకరమైన ప్రాంతంలో చిక్కుకున్న తన సోదరిని రక్షించేందుకు నితిన్ ఎలా పోరాడాడు అన్నదే 'తమ్ముడు' కథగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. 'తమ్ముడు' సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. పలు హై-ఇంటెన్సిటీ ఎమోషనల్ సీన్స్ తో ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అలరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు – శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Tags

Next Story