నిహారిక రెండో సినిమా ముహూర్తం

నిహారిక రెండో సినిమా ముహూర్తం
X
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా స్పీడు పెంచుతుంది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఓటీటీ ఆడియన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు‘తో సిల్వర్ స్క్రీన్ పైనా ప్రొడ్యూసర్ గా అదరగొట్టింది.

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా స్పీడు పెంచుతుంది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఓటీటీ ఆడియన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు‘తో సిల్వర్ స్క్రీన్ పైనా ప్రొడ్యూసర్ గా అదరగొట్టింది. ‘కమిటీ కుర్రోళ్లు‘ చిత్రం విజయాన్ని సాధించడమే కాదు.. పలు వేదికలపై అవార్డులను సైతం అందుకుంది. ఇప్పుడు నిహారిక రెండో చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.

సంగీత్ శోభన్ కు ‘మ్యాడ్‘ సిరీస్ తో హీరోగా మంచి గుర్తింపు లభించింది. ‘ఆయ్, క‘ చిత్రాలలో హీరోయిన్ గా మెప్పించింది నయన్ సారిక. ఈ సినిమాకి నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‘ వెబ్ సిరీస్ ద్వారా దర్శకురాలిగా పరిచయమైన మానస శర్మ దర్శకత్వం వహిస్తుంది. ఈరోజు జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Next Story