చిత్రపురి బోనాల పండుగలో నిధి

చిత్రపురి బోనాల పండుగలో నిధి
X
హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఈ ఏడాది బోనాల పండుగను వైభవోపేతంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి.

హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఈ ఏడాది బోనాల పండుగను వైభవోపేతంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నటి నిధి అగర్వాల్‌ శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించి, చిత్రానికి విజయాన్ని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమానికి ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్ దంపతులు, ఫిలింఛాంబర్ ప్రతినిధులు భరత భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, సి. కళ్యాణ్, భరద్వాజ్, శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొన్నారు.

వల్లభనేని హైమాంజలి–అనిల్ దంపతులు కాలనీవాసుల శ్రేయస్సు కోసం అమ్మవారిని పూజించారు. బోనాల ఏర్పాట్లు, ఫలహార బండ్ల ఊరేగింపులు ఉత్సాహభరితంగా జరిగాయి. సంస్కృతి, భక్తి, సామూహిక ఉత్సాహం ఒక్కటైన ఈ పండుగ.. చిత్రపురి చరిత్రలో ఓ చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

Tags

Next Story