'పరదా' నుంచి కొత్త పాట

పరదా నుంచి కొత్త పాట
X
అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పరదా'. ఈ చిత్రంలో దర్శనా రాజేంద్రన్‌, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పరదా'. ఈ చిత్రంలో దర్శనా రాజేంద్రన్‌, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌ 22న విడుదల కానుంది. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా విడుదలైన 'ఎగరేయి నీ రెక్కలే' అనే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. వనమాలి రాసిన అర్థవంతమైన లిరిక్స్‌కు గోపి సుందర్ సంగీతం అందించగా, రితేశ్ జీ రావు తన వోకల్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఈ పాట విజువల్స్, లోకేషన్స్‌ కూడా హైలైట్‌గా నిలుస్తున్నాయి.



Tags

Next Story