'జాట్‌'కి కొత్త రేంజ్ హైప్

జాట్‌కి కొత్త రేంజ్ హైప్
X
బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘జాట్’.

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘జాట్’. ట్రైలర్ రిలీజ్ తర్వాత 'జాట్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడం, మాస్ యాక్షన్ కోణంలో సన్నీ డియోల్‌ను ప్రెజెంట్ చేయడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 'జాట్' ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతుందనే ఆశలు పెరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఇది కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే విడుదల కానుంది. తెలుగు డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, సినిమాపై బజ్ మరింత పెంచేందుకు 'జాట్' టీమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కలవడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్ర, సయ్యామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్, జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనుండగా, థమన్ సంగీతాన్ని అందించాడు.

Tags

Next Story