కిరణ్ కిట్టీలో కొత్త ప్రాజెక్ట్స్

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా హీరోగా ఎదిగిన వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం యువ హీరోల్లో అత్యంత బిజీగా దూసుకెళ్తున్నాడు కిరణ్. 2019లో ‘రాజా వారు రాణి గారు‘తో వెండితెరపైకి అడుగుపెట్టిన కిరణ్, ‘క‘ మూవీ సూపర్ హిట్ తో తారాపథంలోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఈ యువ హీరో సినిమాలు స్పీడు మరింతగా పెరిగింది.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న ‘కె-ర్యాంప్‘ షూటింగ్ దశలో ఉంది. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘చెన్నై లవ్ స్టోరీ‘ లైన్లో ఉంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది.
సుకుమార్ శిష్యుడు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ‘జిగ్రీస్‘ అనే సినిమాలో కిరణ్ నటించబోతున్నాడు. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ నిర్మించనుందట. ఇంకా.. ‘మిర్జాపూర్‘ ఫేమ్ ఆనంద్ అయ్యర్ డైరెక్షన్ లోనూ ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాని ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu