‘ఓజీ’లోకి నేహా శెట్టి రీఎంట్రీ!

‘ఓజీ’లోకి నేహా శెట్టి రీఎంట్రీ!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్ తో తెర మీద సందడి చేస్తున్న 'ఓజీ' బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కోరుకున్న పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో పవన్‌ను చూపించిన దర్శకుడు సుజీత్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్ తో తెర మీద సందడి చేస్తున్న 'ఓజీ' బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కోరుకున్న పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో పవన్‌ను చూపించిన దర్శకుడు సుజీత్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ భార్య పాత్రలో కనిపించింది.

అయితే.. ఈ మూవీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉందట. నేహా కూడా దీనిని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. కానీ విడుదలైన సినిమాలో ఆమె సాంగ్, సీన్స్ ఎడిటింగ్‌లో కట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కోసం నేహా శెట్టి పాటను, సన్నివేశాలను కలపబోతున్నారట. వచ్చే సోమవారం నుంచి 'ఓజీ'లో అవి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. మరి.. నేహా స్పెషల్ అప్పీరెన్స్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags

Next Story