మళ్ళీ కోర్ట్ కేసులో నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి కారణం అభినందనలు కాదు – మళ్ళీ కాపీరైట్ వివాదాలే.
తాజా గా మద్రాస్ హైకోర్టు నెట్‌ఫ్లిక్స్, టార్క్ స్టూడియోస్ కు నోటీసులు జారీ చేసింది. చంద్రముఖి సినిమాకు సంబంధించిన బీహైండ్-ది-సీన్స్ దృశ్యాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ, ఆ సినిమాను నిర్మించిన ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినప్పటికీ స్పందన లేదని, రూ. 5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు ఈ కేసులో రెండు వారాల్లోగా ప్రత్యుత్తరం ఇవ్వాలని సంబంధిత పక్షాలను ఆదేశించింది.
ఇది ఒక్కటే కాదు. ఇప్పటికే మరో కేసు ధనుష్ కు చెందిన వండర్‌బార్ ఫిలిమ్స్ దాఖలు చేసింది. 2015లో విడుదలైన నాను రౌడీ ధాన్ చిత్రం నుంచి మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, అలాగే వారి సంస్థ రౌడీ పిక్చర్స్ పై కేసు నమోదు కాగా, ఇందులో రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతున్నారు.
ఒకట్రెండు కాకుండా ఇలా రెండు కాపీరైట్ వివాదాలు ఒకేసారి ఎదురవుతుండటంతో, ఈ డాక్యుమెంటరీపై ఇప్పటి దృష్టి అనేక ప్రశంసల నుంచి న్యాయపరమైన విచారణల వైపు మళ్లింది.
వివాహ వేడుకను మరపురానిదిగా మార్చేందుకు తీసిన డాక్యుమెంటరీ ఇప్పుడు కోర్టు కేసుల గీతల మధ్య చిక్కుకుంది.
-
Home
-
Menu