నవీన్ చంద్ర కొత్త సినిమా ‘కరాలి‘

తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలతో మంచి దూకుడు మీదున్నాడు నవీన్ చంద్ర. ఒకవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ యాక్టర్ గా, విలన్ గానూ తన వెర్సటాలిటీ చూపిస్తున్నాడు.ఈ ఏడాది ఇప్పటికే హీరోగా ‘28 డిగ్రీస్ సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవన్‘ వంటి సినిమాలను ఆడియన్స్ కు అందించిన నవీన్ చంద్ర ఇటీవలే ‘హనీ‘ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. కరుణకుమార్ దర్శకత్వంలో ‘హనీ‘ సినిమా రూపొందుతుంది.
మరోవైపు తాజాగా ‘కరాలి‘ అనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై మందలపు శివకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘అనగనగా‘ ఫేమ్ కాజల్ చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ సింగ్ మరో నాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
-
Home
-
Menu