కోట శ్రీనివాసరావు మృతి పట్ల నారా లోకేష్ సంతాపం

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి తీరని లోటును మిగిల్చుతూ ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
"నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్న కోట శ్రీనివాసరావు గారు ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోశారు. తెలుగు తో పాటుగా ఇతర భాషల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనదే. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజాసేవలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని తన పోస్ట్ లో తెలిపారు లోకేష్.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం… pic.twitter.com/K6KZPGio8l
— Lokesh Nara (@naralokesh) July 13, 2025
-
Home
-
Menu