నాని ప్రమోషనల్ స్ట్రాటజీ

నాని ప్రమోషనల్ స్ట్రాటజీ
X
సినిమా తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. చాలా సందర్భాల్లో సినిమా విజయానికి నటనతో పాటు, సరైన ప్రమోషన్ కూడా కీలకమవుతుంది.

సినిమా తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. చాలా సందర్భాల్లో సినిమా విజయానికి నటనతో పాటు, సరైన ప్రమోషన్ కూడా కీలకమవుతుంది. అయితే అందరు స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్‌కి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ.. నేచురల్ స్టార్ నాని మాత్రం సెపరేటు.

నటనతో పాటు మార్కెటింగ్ లోను తనదైన ముద్ర వేస్తున్నాడు నాని. ఇటీవలే ‘కోర్ట్‘తో నిర్మాతగా ఘన విజయాన్నందుకున్న నాని.. ఇప్పుడు హీరోగా, ప్రొడ్యూసర్ గా ‘హిట్ 3‘తో వస్తున్నాడు. మే 1న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచాడు నాని.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ‘హిట్ 3‘ ప్రమోషనల్ సెట్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కత్తులు, తుపాకులు, ఇంటరాగేషన్ రూములు, లాకప్‌లు, జైలు గదులు… ఇలా ఒక థ్రిల్లింగ్ క్రైమ్ ప్రపంచాన్ని మలచినట్లు ఉన్న ఆ సెట్లో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు నేరుగా వెళ్లి ఇంటర్వ్యూలు చేయగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ రకమైన ఎంగేజింగ్ ప్రమోషన్ ప్రయత్నం చాలా అరుదుగా చూస్తాం.



Tags

Next Story