నాని కొత్త సినిమా.. 'డాన్' డైరెక్టర్‌తో డీల్ కుదిరింది!

టాలెంట్ ను వెతికి పట్టుకోవడంలో నేచురల్ స్టార్ నాని ముందుంటాడు. ఈకోవలోనే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడం చకాచకా జరిగిపోతున్నాయట. 'సరిపోదా శనివారం' సూపర్ హిట్ తర్వాత నాని 'హిట్-3'తో బిజీగా ఉన్నాడు.
శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న 'హిట్ 3' మే 1న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్', సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ కంటే ముందే తమిళ 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తితో సినిమాని పట్టాలెక్కిస్తాడట. మే నుంచే నాని-సిబి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట.
ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు ముస్తాబయ్యేలా నాని-సిబి చక్రవర్తి మూవీ పనులు జరుగుతున్నాయట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా నాని లైనప్ ఇప్పుడు మరింత క్రేజీగా మారింది. త్వరలోనే నాని-సిబి చక్రవర్తి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu