నాని స్పీడ్‌కి బ్రేక్స్ లేవు!

నాని స్పీడ్‌కి బ్రేక్స్ లేవు!
X
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇదే ఊపులో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో పెడుతున్నాడు.

నేచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇదే ఊపులో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో పెడుతున్నాడు. ‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’.. లేటెస్ట్ గా ‘హిట్ 3‘తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్‘తో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకోసం ఓ భారీ బస్తీ సెట్ ను నిర్మిస్తున్నారు. అక్కడే మేజర్ పార్ట్ చిత్రీకరణ జరగనుంది.

‘ది ప్యారడైజ్‘ పూర్తవ్వ గానే సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు నాని. ఇప్పటికే నాని-సుజీత్ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ సంస్థ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతుంది.

శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్‘, సుజీత్ సినిమాలతో పాటు.. లేటెస్ట్ గా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. తనకు ‘హిట్ 3‘ వంటి ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ అందించిన శైలేష్ కొలను తో.. ఓ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నాడట నాని. లేటెస్ట్ గా ‘హిట్ 3‘ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించాడు.

Tags

Next Story