రాజమౌళి 'మహాభారతం'లో నాని!

భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి చూపించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'మహాభారతం'ను చెబుతూ వస్తున్నాడు. ఈ మెగా మైథలాజికల్ మూవీని పలు భాగాలుగా తీసుకురానున్నాని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. లేటెస్ట్ గా నాని 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా 'మహాభారతం' టాపిక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘హిట్: ది థర్డ్ కేస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, రాజమౌళి తన 'మహాభారతం'లో నాని నటిస్తాడని ధృవీకరించాడు. అయితే, నాని పాత్ర ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశాడు. దీంతో నాని ఏ పాత్రలో కనిపించనున్నాడనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది.
రాజమౌళి దర్శకత్వంలో నాని ఇప్పటికే 'ఈగ' సినిమాలో నటించాడు. ఇప్పుడు 'మహాభారతం' కోసం నేచురల్ స్టార్ ని మరోసారి రిపీట్ చేయనున్నాడు రాజమౌళి. మొత్తంగా ప్రస్తుతం రాజమౌళి, మహేష్‌బాబుతో భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ SSMB29 పై పనిచేస్తున్నాడు. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
-
Home
-
Menu