నాని క్లాప్ తో దుల్కర్ సినిమా

నాని క్లాప్ తో దుల్కర్ సినిమా
X
తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. దుల్కర్ 41వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. దుల్కర్ 41వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇవ్వగా, దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విఛ్ఛాన్ చేశారు.

‘డీక్యూ41’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటించనున్నట్టు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రెడీ అవుతుంది.



Tags

Next Story