ముచ్చటగా మూడోసారి నాని-అనిరుధ్ కాంబో!

ముచ్చటగా మూడోసారి నాని-అనిరుధ్ కాంబో!
X
కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ తో సినిమా చేసేందుకు తమిళనాట అగ్ర కథానాయకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అనిరుధ్ మాత్రం తెలుగులో నేచురల్ స్టార్ నానితో పనిచేయడానికి ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పటికే నాని-అనిరుధ్ కాంబోలో ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్‘ వంటి సినిమాలొచ్చాయి.

కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ తో సినిమా చేసేందుకు తమిళనాట అగ్ర కథానాయకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అనిరుధ్ మాత్రం తెలుగులో నేచురల్ స్టార్ నానితో పనిచేయడానికి ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పటికే నాని-అనిరుధ్ కాంబోలో ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్‘ వంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు.

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‘ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఫిక్సయ్యాడు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే త్వరలోనే ‘ది ప్యారడైజ్‘ షూటింగ్ మొదలవ్వబోతుందనే హింట్ కూడా ఇచ్చింది. ‘ది ప్యారడైజ్‘ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘దసరా‘ వంటి సూపర్ హిట్ అందుకున్న నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న ‘ది ప్యారడైజ్‘పై భారీ అంచనాలున్నాయి.

Tags

Next Story