
ఢిల్లీ హైకోర్టుకు నాగార్జున కృతఙ్ఞతలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వ్యక్తిత్వ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆధునిక డిజిటల్ యుగంలో తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాడుతూ వ్యాపారం చేస్తున్నారని, ముఖ్యంగా ఏఐ సాయంతో మార్ఫ్‌డ్ కంటెంట్ సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూట్యూబ్‌లో షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేసి, నాగార్జున హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రమోషన్లు చేస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.
సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్‌తో పాటు ప్రవీణ్ ఆనంద్, వైశాలి, సోమ్‌దేవ్ వాదనలు వినిపించగా, కోర్టు నాగార్జునకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. అనుమతి లేని ఫోటోలు, వీడియోలు, పేరు వాడకుండా నిషేధం విధించాలని ఆయన కోరగా, జస్టిస్ తేజస్ కరియా దీనిపై సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా నాగార్జున తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించినందుకు ఢిల్లీ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ తదితర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలాంటి సమస్యలపై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
-
Home
-
Menu