‘కన్నప్ప‘పై నాగవంశీ ప్రశంసల వర్షం!

మంచు విష్ణు ‘కన్నప్ప‘ ఎట్టకేలకు విడుదలైంది. పాన్ ఇండియా లెవెల్ లో మల్టీస్టారర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ‘కన్నప్ప‘కి అంతటా ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలోనూ ‘కన్నప్ప‘కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తోంది. ఈనేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి ‘కన్నప్ప‘కు అభినందనల వెల్లువ మొదలైంది.
ప్రముఖ నిర్మాత నాగవంశీ ‘కన్నప్ప‘ సక్సెస్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ శుక్రవారం మీదే విష్ణు గారు అంటూ.. విష్ణు తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించడం పట్ల అభినందనలు తెలిపారు నాగవంశీ. అలాగే ‘కన్నప్ప‘ చిత్రానికి థియేటర్లన్నీ హౌస్ఫుల్ అవుతూ, అద్భుతమైన స్పందన రావడం గర్వంగా ఉంది.. అని తన ట్వీట్ లో తెలిపారు.
అలాగే ఇన్ని ఏళ్లుగా విష్ణు పెట్టిన శ్రమకు ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది! మీపై ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ వచ్చినవారికి మీరు చెంప పెట్టు వంటి సమాధానం ఇచ్చారు అని నాగవంశీ కామెంట్ చేశారు. ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ పోషించిన కేమియోని తన పోస్టులో ప్రత్యేకంగా ప్రస్తావించారు నాగవంశీ.
AND YES… THIS IS YOUR FRIDAY @iVishnuManchu garu 🤗❤️
— Naga Vamsi (@vamsi84) June 27, 2025
So happy to see #Kannappa already becoming the biggest opening of your career with theatres going houseful and the response looking fantastic..
All these years of hard work are finally paying off big!!! Moreover to all…
-
Home
-
Menu