'వార్ 2' రేస్‌లో విజేత నాగవంశీ!

వార్ 2 రేస్‌లో విజేత నాగవంశీ!
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'వార్ 2' బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'వార్ 2' బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీలో హృతిక్‌తో కలిసి డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ చెలరేగిపోనున్నాడు తారక్.

యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు రైట్స్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ. 80-90 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడినప్పటికీ, చివరకు నాగవంశీ 'వార్ 2'ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' హక్కులను కూడా నాగవంశీ పొందిన విషయం తెలిసిందే.

ఇక సినిమా విషయానికొస్తే.. చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, ప్రస్తుతం తారక్-హృతిక్ లపై ఓ భారీ డాన్స్ నంబర్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం, బాస్కో మార్టిన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 14న ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story