నాగచైతన్య ‘తండేల్‘ మూవీ హైలైట్స్!

నాగచైతన్య ‘తండేల్‘ మూవీ హైలైట్స్!
X
నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ‘తండేల్‘ రేపు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

విశేషమేమిటంటే ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో ‘100 పర్సెంట్ లవ్‘ వంటి హిట్ అందుకున్నాడు చైతన్య. అలాగే చందూ మొండేటి డైరెక్షన్ లో చైతన్య నటించిన ‘ప్రేమమ్‘ హిట్ అయ్యింది. ఇక సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ‘ చేసి విజయాన్నందుకున్నాడు. నాగచైతన్య నటించిన పలు చిత్రాలకు అదిరిపోయే హిట్ సాంగ్స్ అందించాడు దేవిశ్రీప్రసాద్. అలా పలు హిట్ కాంబినేషన్స్ లో ‘తండేల్‘ వస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

‘తండేల్‘ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ సంగీతంలో ‘బుజ్జి తల్లి, ఓం నమః శివాయ, హైలెస్సో‘ పాటలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ‘తండేల్‘ అదరగొట్టింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.

ఈ సినిమాలో లవ్, పేట్రియాటిజమ్ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అవుతాయని చిత్రబృందం చెబుతోంది. మొత్తంగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన ‘తండేల్‘ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో ఉంది టీమ్.

Tags

Next Story