రేపు రాబోతున్న చిత్రాలు

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. ‘రాబిన్ హుడ్‘ నిరాశపరచడంతో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్. రేపు గ్రాండ్ లెవెల్ లో ‘తమ్ముడు‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.
హీరో సిద్ధార్థ్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. లేటెస్ట్ గా ‘3 BHK’ మూవీ కోసం కాలేజ్ కుర్రాడిగా మురిపించబోతున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనే ప్రయత్నాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ ఫ్యామిలీ రేపు తెలుగు, తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని సిద్ధార్థ్ తల్లిదండ్రులుగా నటించగా, యోగిబాబు, మీరా రఘునాథ్, చైత్ర ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రేపు విడుదలవుతోన్న చిత్రాలలో ‘సోలో బాయ్‘ కూడా ఉంది. ‘బిగ్ బాస్‘ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోలో బాయ్‘. ఈ సినిమాలో అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ ఇతర కీలకపాత్రలు పోషించారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవీన్ కుమార్ తెరకెక్కించారు.
-
Home
-
Menu