సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా !

సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా !
X
కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని మేకర్స్ ఆదివారం సోషల్ మీడియాలో కాస్టింగ్ కాల్ ద్వారా ప్రకటించారు.

మాలీవుడ్ ప్రముఖ హీరో, రచయిత విష్ణు ఉన్నికృష్ణన్.. దర్శకుడు నాదిర్షాతో మరోసారి కలసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని మేకర్స్ ఆదివారం సోషల్ మీడియాలో కాస్టింగ్ కాల్ ద్వారా ప్రకటించారు. విష్ణుకు జోడీగా నటించేందుకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు గల కొత్త ముఖాన్ని వెతుకుతున్నారు.

విష్ణు, నాదిర్షాలది ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో. నాదిర్షా దర్శకుడిగా పరిచయం అయిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రానికి సహ రచయితగా పని చేశాడు విష్ణు. అనంతరం నాదిర్షా రెండోసారి దర్శకత్వం వహించిన ‘కట్టప్పనయిలే రిత్విక్ రోషన్’ చిత్రంలో విష్ణు హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

ఇక కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రకటనలో.. వెటరన్ నటులు హరిశ్రీ అశోకన్, జాఫర్ ఇడుక్కి, సినిమాటోగ్రాఫర్ సజిత్ పురుషన్, ఎడిటర్ జాన్ కుట్టిని ట్యాగ్ చేశారు. వీరంతా ప్రాజెక్టులో భాగం కావొచ్చని సూచనలు ఉన్నాయి. పూర్తి తారాగణం మరియు నిర్మాణ వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

విష్ణు చివరిసారి నటించిన చిత్రం ‘తానారా’ అయితే, నాదిర్షా చివరిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కొచ్చి’. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించడం విశేషం.

Tags

Next Story