థ్రిల్లర్ జోనర్ లోకి మళ్లీ వినీత్ శ్రీనివాసన్

‘తిర’ విడుదలైన 12 సంవత్సరాల తర్వాత మలయాళ హీరో వినీత్ శ్రీనివాసన్ దర్శకుడిగా థ్రిల్లర్ జానర్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి నోబుల్ బాబు థామస్ స్క్రిప్ట్ రాసి, హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జార్జియా, రష్యా, అజర్‌బైజాన్ సరిహద్దుల్లో విస్తృతంగా షూట్ చేశారు. అలాగే, షిమ్లా, చండీగఢ్, కొచ్చిలో కూడా కొంత భాగం చిత్రీకరించారు. నోబుల్ బాబు థామస్.. వినీత్ శ్రీనివాసన్ కు దీర్ఘకాల మిత్రుడు.
గతంలో ఆయన ‘జాకబిన్టే స్వర్గరాజ్యం, అరవిందన్టే అతిధికల్, హెలెన్’ సినిమాలను నిర్మించాడు. ‘హెలెన్’ చిత్రానికి సహ రచయితగా కూడా పనిచేశాడు. అలాగే హీరోగా నటించాడు. ఇంకా ‘హృదయం, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, ఫిలిప్స్’ వంటి సినిమాల్లో నటించాడు. ఈ కొత్త సినిమాలో నోబుల్‌తో పాటు ఆడ్రీ మిరియమ్, రేష్మా సెబాస్టియన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మనోజ్ కె. జయన్, కలభవన్ షాజోన్, బాబు రాజ్, విష్ణు జి. వారియర్, జానీ ఆంటోనీ సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా ద్వారా వినీత్, సినిమాటోగ్రాఫర్ జోమోన్ టి. జాన్, సంగీత దర్శకుడు షాన్ రెహమాన్, ఎడిటర్ రంజన్ అబ్రహామ్‌లతో మళ్లీ కలిసాడు. ఈ టీమ్ గతంలో ‘తట్టతిన్ మరయత్తు, తిర, జాకబిన్టే స్వర్గరాజ్యం’ సినిమాల్లో కలిసి పనిచేసింది. వినీత్ నిర్మాణ సంస్థ హాబిట్ ఆఫ్ లైఫ్, విశాక్ సుబ్రమణ్యం మెర్రీల్యాండ్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న పూజా సీజన్‌లో విడుదల కానుంది.
-
Home
-
Menu