ఆకట్టుకుంటున్న ‘నరివేట్ట’ మలయాళ ట్రైలర్

ఆకట్టుకుంటున్న ‘నరివేట్ట’ మలయాళ ట్రైలర్
X
ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించాడు. కథను మాజీ జర్నలిస్ట్ అబిన్ జోసెఫ్ రాశారు. ‘నరివేట్ట’ కథ కేరళలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా రూపొందింది.

మాలీవుడ్ యంగ్ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా ‘నరివేట్ట’. ఈ మూవీ వచ్చేనెల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించాడు. కథను మాజీ జర్నలిస్ట్ అబిన్ జోసెఫ్ రాశారు. ‘నరివేట్ట’ కథ కేరళలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా రూపొందింది.

ట్రైలర్ మిస్టరీ, భావోద్వేగాల మిశ్రమంతో ఆకట్టుకుంటుంది. టోవినో థామస్ కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ పాత్రలో ఒక ముఖ్యమైన పోలీస్ మిషన్‌లో కనిపిస్తాడు. సినిమాలో సురాజ్ వెంజరమూడ్ భావోద్వేగ నటనతో మరోసారి ఆకట్టు కోనున్నాడు. మలయాళ చిత్రంలో తొలిసారి నటిస్తున్న తమిళ నటుడు చేరన్ స్థిరమైన నటనతో ఆకర్షించాడు. ఈ ముగ్గురు నటీనటులు సినిమాకు భావోద్వేగ బలం అందించారు.

‘నరివేట్ట’ సినిమా మే 16న విడుదల కానుంది. షియాస్ హసన్, టిప్పు షాన్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ సినిమాటోగ్రాఫర్, షమీర్ మహమ్మద్ ఎడిటర్, బావా ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ట్రైలర్‌కు ముందు విడుదలైన "మిన్నల్వాలా" పాట, జేక్స్ బిజోయ్ స్వరకల్పనలో, సిద్ శ్రీరామ్ మరియు సితార కృష్ణకుమార్ ఆలపనలో 40 లక్షల వీక్షణలతో వైరల్‌గా మారింది. మరి ‘నరివేట్ట’ సినిమా టోవినో థామస్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags

Next Story