టోవినో థామస్ ‘నరివేట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నరివేట్ట' సినిమా మే నెలలో విడుదల కానుందని మేకర్స్ మంగళవారం ప్రకటించారు. ఖచ్చితమైన విడుదల తేదీ ప్రక టించకపోయినా, మే 16న సినిమాను విడుదల చేయాలని టీం యోచిస్తోంది. ఈ చిత్రాన్ని ఇండియన్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై టిప్పు షా, షియాస్ హసన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
అందులో టోవినో తో పాటు సురజ్ వెంజారమూడు, తమిళ నటుడు, దర్శకుడు చేరన్ కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో టోవినో పోలీసు కానిస్టేబుల్ పాత్ర అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో ఓ చిన్నారిని రక్షిస్తున్నట్టు చూపించారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని కుదిపేసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
'ఇష్క్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనురాజ్ మనోహర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అందుకున్న జర్నలిస్ట్, కథా రచయిత అబిన్ జోసఫ్ స్క్రిప్ట్‌ను అందించారు. ముఖ్య పాత్రల్లో ఆర్య సలీమ్, ప్రియంభద కృష్ణన్, రిని ఉదయకుమార్ నటిస్తున్నారు. సినిమాకు జేక్స్ బీజాయ్ సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం విజయ్, ఎడిటింగ్ షమీర్ మహమ్మద్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ థ్రిల్లర్ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
-
Home
-
Menu