టోవినో థామస్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

టోవినో థామస్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
X
1950ల చివరి కాలంలో కేరళ హై రేంజ్‌లలోని వలస వ్యవసాయ కమ్యూనిటీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘దాదా సాహిబ్, షిక్కార్, నదన్, కనల్, ఒరుత్తి’ వంటి సినిమాలకు స్క్రిప్ట్ రాసిన ఎస్ సురేష్ బాబు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

టోవినో థామస్ నటిస్తున్న కొత్త పీరియడ్ డ్రామా ‘పళ్ళి చట్టంబి’ తాజాగా తొడుపుళలో షూటింగ్ ప్రారంభమైంది. ‘జన గణ మన’ ఫేమ్ డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ‘డ్రాగన్’ బ్యూటీ కాయడు లోహర్ కూడా నటిస్తోంది. 1950ల చివరి కాలంలో కేరళ హై రేంజ్‌లలోని వలస వ్యవసాయ కమ్యూనిటీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘దాదా సాహిబ్, షిక్కార్, నదన్, కనల్, ఒరుత్తి’ వంటి సినిమాలకు స్క్రిప్ట్ రాసిన ఎస్ సురేష్ బాబు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

‘పళ్ళి చట్టంబి’ లో విజయరాఘవన్, సుధీర్ కరమణ, జానీ ఆంటోనీ, టీజీ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్, శ్రీజిత్ రవి, వినోద్ కేదమంగళం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇడుక్కిలోని వివిధ లొకేషన్లలో షూటింగ్ జరగనున్న ఈ సినిమాకు టిజో టోమీ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సరంగ్ ఎడిటింగ్, జేక్స్ బిజోయ్ సంగీతం, దిలీప్ నాథ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నౌఫల్, బ్రిజేష్‌లు వరల్డ్‌వైడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2019లో ప్రకటించినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ చేశారు.

చివరిసారిగా అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో ‘నరివేట్ట’ లో కనిపించిన టోవినో థామస్, రాబోయే చిత్రాల్లో షిల్పా అలెగ్జాండర్ డైరెక్ట్ చేస్తున్న అవరన్, సైజు శ్రీధరన్ రూపొందిస్తున్న ముంపే, ముహ్సిన్ పరారి తీస్తున్న ‘తందవైబ్’ లో నటిస్తున్నాడు.

Tags

Next Story